﻿1
00:00:08,000 --> 00:00:10,000
ఎర్రగా, రాళ్లతో కూడిన ఉపరితలం.

2
00:00:10,500 --> 00:00:13,400
అచ్చంగా కుజ గ్రహం మాదిరిగానే!

3
00:00:13,800 --> 00:00:17,500
ఇది, చిలీదేశంలోని అటకామా ఎడారి.

4
00:00:18,300 --> 00:00:19,600
పొడారిపోయి,

5
00:00:19,600 --> 00:00:21,000
శూన్యంగా,

6
00:00:21,000 --> 00:00:24,000
నిర్జీవంగా కనిపిస్తోంది.

7
00:00:24,000 --> 00:00:25,600
కాని, అంతటా అలా లేదు.

8
00:00:26,000 --> 00:00:32,000
నగరంలోని దీపాలకు సుదూరంగా 2600 మీటర్ల ఎత్తైన కొండమీద,

9
00:00:32,000 --> 00:00:40,000
ఈసోకు చెందిన  వెరీ లార్జ్‌ టెలెస్కోప్‌ (విఎల్‌టీ)ఉంది. భూమిమీదనుంచి రాత్రిపూట ఆకాశాన్ని చాలా స్పష్టంగా చూపే టెలిస్కోపుల్లో ఇదే ఉత్తమమైంది.

10
00:00:41,600 --> 00:00:47,600
భారీ గుమ్మటాల్లో భద్రంగా నిర్మించిన ఈ టెలిస్కోపులను చూడండి. ఇటువంటి అతి శక్తివంతమైన, అత్యాధునిక టెలిస్కోపులు మరెక్కడా లేదు.

11
00:00:48,000 --> 00:00:54,000
ఈ టెలిస్కోపుల సహాయంతో, మన కంటితో చూసే తారలకన్న, 400కోట్ల రెట్లు తక్కువ కాంతిగల తారలను కూడ స్పష్టంగా చూడవచ్చు.

12
00:00:54,000 --> 00:01:01,000
వీటిద్వారా, మనం విశ్వాంతరాళాన్ని మునపటికన్న ఎక్కువ లోతుగా పరిశీలించగలం.

13
00:01:04,000 --> 00:01:07,000
ప్రకాశవంతంగా మెరుస్తున్న ఈ పట్టీయే పాలపుంత!

14
00:01:11,000 --> 00:01:20,000
మన సూర్యుడు, మన సౌరవ్యవస్థతోపాటు, లక్షలాది తారలకూ, ఇతర సౌరవ్యవస్థలకూ పుట్టిల్లు.

15
00:01:23,000 --> 00:01:28,000
ఇవివృశ్చిక ధనుర్‌ రాసులు.

16
00:01:30,000 --> 00:01:32,900
ఈ రెండూ రాత్రిపూట ఆకాశంలో సంచరించే

17
00:01:37,000 --> 00:01:41,900
88 తారాసముదాయాల్లోనివి.

18
00:02:09,000 --> 00:02:18,000
కంటికి కనిపించే వెలుగుతోను, ఇన్‌ఫ్రారెడ్‌ వెలుగుతోను పనిచేసే ఆధునిక టెలిస్కోపులు, దృష్టిని మసకబరిచే వాయు, ధూళి మేఘాలను చీల్చుకుని,

19
00:02:21,000 --> 00:02:25,000
మన గెలాక్సీ కేంద్రాన్ని చేరుకునే వీలు కల్పిస్తున్నాయి.

20
00:02:28,500 --> 00:02:37,000
వాయు, ధూళి మేఘాలతో నిండి ఉన్న పాలపుంత కేంద్రంలో, తారలు తిరుగుతూ కనిపిస్తాయి.

21
00:03:08,500 --> 00:03:17,000
గత 20 ఏళ్లుగా ఈ వెరీ లార్జ్‌ టెలిస్కోపు, కెక్‌ టెలిస్కోపుల సహాయంతో, వందకు పైగా తారల సంచారాన్ని శాస్రవేత్తలు గమనిస్తున్నారు.

22
00:03:20,000 --> 00:03:26,000
మన పాలపుంత గర్భంలో, అతి బలమైన శక్తి ఏదో ఉందని, ఆ తారలు మనకి తెలియచేసాయి.

23
00:03:26,500 --> 00:03:32,000
అదొక కృష్ణబిలం! మన సూర్యునికన్న 40లక్షల రెట్లు పెద్దది!

24
00:03:34,000 --> 00:03:37,600
ఈ కృష్ణబిలాల వాస్తవ స్వభావమేమిటన్నది, ఇంకా అంతు చిక్కని రహస్యంగానే ఉంది.

25
00:03:38,000 --> 00:03:44,800
చరిత్రలో  మహా మహా శాస్త్రవేత్తలనే, అవి కంగు తినిపించాయి. కాల్పనిక విజ్ఞాన సాహిత్యానికి అభిమాన వస్తువులుగా నిలిచాయి.

26
00:03:45,000 --> 00:03:49,500
కృష్ణబిలాలు, తమ తోవకి అడ్డువచ్చిన దేనినైనా మింగేస్తాయి.

27
00:03:49,500 --> 00:03:57,500
మన గెలాక్సీలో  ఆసక్తిదాయకమైన తారల్లో కొన్ని, ఈ కృష్ణబిలం గురుత్వాకర్షణ గుప్పెట్లో చిక్కుకుని ఉన్నాయి.

28
00:03:58,000 --> 00:04:03,000
ఐనా ఈ కృష్ణబిలం, తన చుట్టూ తిరిగే తారలతో సంతృప్తిచెందే రకంకాదు.

29
00:04:04,000 --> 00:04:08,500
మన భూమి కన్న ఎన్నోరెట్లు ఎక్కువ ద్రవ్యరాసి ఉన్న భారీ వాయు మేఘం ఒకటి,

30
00:04:08,500 --> 00:04:12,000
గంటకి 80లక్షల కి.మీ వేగంతో, కనపడని ఈ రాకాసివైపు దూసుకెళుతోంది.

31
00:04:12,000 --> 00:04:17,800
దాని కధ ముగిసినట్టే!

32
00:04:22,000 --> 00:04:29,800
పాలపుంత కేంద్రంలో ఉన్న తారలను అధ్యయనం చేయడంద్వారా, మనం దాని గర్భంలో అంతుపట్టని శక్తి ఏదో ఉందని కనుక్కోగలిగాం.

33
00:04:31,000 --> 00:04:33,900
కాని మన ప్రయాణం ఇక్కడితో ఆగదు.

34
00:04:35,000 --> 00:04:44,000
కేంద్రం నుండి బయటకు వచ్చి చూస్తే, అత్యాధునిక ఇన్‌ఫ్రారెడ్‌ పరిశీలనలు, పాలపుంతలో విస్తారమైన ప్రాంతాన్ని ఆవిష్కరించాయి.

35
00:04:45,000 --> 00:04:52,000
మన వెరీ లార్జ్‌  టెలిస్కోపుకు పొరుగునే ఉన్న విస్టా, ప్రపంచంలోకెల్లా, అతి శక్తివంతమైన ఇన్‌ఫ్రారెడ్‌ సర్వే టెలిస్కోపు.

36
00:04:53,000 --> 00:04:57,000
దానికి మన దృక్పధాన్నే మార్చివేసే శక్తి ఉంది....

37
00:04:59,000 --> 00:05:06,000
విస్టా చూపులోని తీక్షణతకి, ధూళిమేఘాల తెరకు తూట్లు పడ్డాయి.

38
00:05:07,000 --> 00:05:14,000
ఒకప్పుడు  ఆకాశాన్నంతా ఆవరించివున్న నల్లని ధూళిమబ్బులు, ఇప్పుడు దాదాపుగా అదృశ్యమయ్యాయి.

39
00:05:16,000 --> 00:05:21,000
840 లక్షల తారలను చూపుతున్న ఈ ఇన్‌ఫ్రారెడ్‌ దృశ్యం  మనకు లభించిన అతి పెద్ద ఖగోళదృశ్యాల్లో ఒకటి.

40
00:05:21,000 --> 00:05:24,000
అంటే 840 లక్షల తారలు,

41
00:05:25,000 --> 00:05:31,000
840 లక్షల అద్భుతాలను పరిష్కారంకోసం, ఎదురు చూస్తున్నాయి!

42
00:05:31,000 --> 00:05:35,700
అక్కడ గ్రహాలు, చంద్రులు, నీరు ఉన్నాయా?

43
00:05:36,500 --> 00:05:37,830
జీవం మాటేమిటి?

44
00:05:48,000 --> 00:05:51,700
పాలపుంతను మనం, మునపటికన్న లోతుగా అధ్యయనం చేసాం.

45
00:05:51,700 --> 00:05:57,100
ఎన్నో సమాధానాలు లభించాయి. కాని ఇంకా లక్షల సంఖ్యలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

46
00:06:00,000 --> 00:06:05,000
పాలపుంతలోని అద్భుతాలను ఆవిష్కరిస్తూ, వాటి మర్మాన్ని ఛేదిస్తూ,

47
00:06:05,500 --> 00:06:12,000
ఈసో టెలిస్కోపులు, తమ ఆకాశ శోధనా కార్యక్రమాన్ని ఇకపై కూడా కొనసాగిస్తాయి.

48
00:06:21,090 --> 00:06:31,200
ఎసో ద్వారా లిప్యంతరీకరణ; అనువాదం ద్వారా -

